Share News

డ్రా పద్ధతిలో మద్యం షాపుల రిజర్వేషన్లు ఖరారు

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:19 AM

జిల్లాలో 2025-2027 సంవత్స రానికి సంబంధించి మద్యం షాపులకు ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు.

డ్రా పద్ధతిలో మద్యం షాపుల రిజర్వేషన్లు ఖరారు

సిరిసిల్ల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 2025-2027 సంవత్స రానికి సంబంధించి మద్యం షాపులకు ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎక్సైజ్‌ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో డ్రాను నిర్వహించామన్నారు. నూతన మద్యం దుకాణాల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జిల్లాలో 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ కులస్థులకు 9దుకాణాలు, ఎస్సీలకు 5 దుకాణా లు రిజర్వేషన్‌ ప్రకారం కేటాయించామని వెల్లడించారు. రౌండ్ల వారీగా డ్రాను తీశారు. ఎస్సీలకు డ్రా పద్ధతిలో వచ్చిన దుకాణాల నంబర్లు 14,28, 34,40,43 కేటాయించారు. గౌడ కులస్థులకు డ్రా పద్ధతిలో వచ్చిన 9 దుకా ణాల నంబర్లు 02,15,17,18,33,36,,38,46,48 కేటాయించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఎక్సైజ్‌ అధికారి రాధాకృష్ణరెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి రవీంద ర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:19 AM