నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:09 AM
జాతీయ గ్రంఽథాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంధాయంలో శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీని కోసం చైర్మన్ సత్తు మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ కల్చరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జాతీయ గ్రంఽథాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంధాయంలో శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీని కోసం చైర్మన్ సత్తు మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్మార్ట్ సిటీ నిధులతో అన్ని హంగులతో కూడిన మూడంతస్థుల భవనం ఏర్పాటు కావాల్సి ఉంది. గత యేడు జూన్ 21న పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం తగిన ఫర్నిచర్‌తో కూడిన భవన నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి.
ఫ నిర్వహించనున్న కార్యక్రమాలు
14న 10 గంటల నుంచి ప్రారంభ వేడుక, మా గ్రంఽథాలయం అనే అంశంపై చిత్రలేఖన పోటీ నిర్వహిస్తారు. 15న ఉదయం 11 గంటలకు పుస్తక ప్రదర్శన, గ్రంఽథాలయ అవగాహనపై వన్ మినెట్ మెమొరీ గేమ్, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు గ్రంఽథాలయ అభివృద్ధిపై వ్యాసరచన పోటీ ఉంటుంది. 12 గంటలకు గంట పాటు నిశ్శబ్ద పఠనం. పుస్తక పఠన, డిజిటల్ పఠన ప్రాధాన్యంపై కళాశశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహిస్తారు. 16న ఉదయం 11 గంటలకు 7, 8 తరగతుల వారికి క్విజ్ ఉంటుంది. 17న ఉదయం 11 గంటలకు ధ్యానం వ్యక్తిత్వాభివృద్ధి తరగతులు, 12 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తారు. 18న ఉదయం 11 గంటలకు జ్ఞానం, చదువు అంశాలపై జానపద గేయాల పోటీ, 19న ఉదయం 11 గంటలకు పాఠశాల, కళాశాల విద్యార్థినులకు, మహిళలకు రంగోలీ పోటీ, 12 గంటలకు దివ్యాంగులకు చెస్, క్యారం పోటీలు ఉంటాయి. 20న ఉదయం 11 గంటలకు ముగింపు వేడుక నిర్వహిస్తారు.
ఫ వారోత్సవాలను విజయవంతం చేయాలి
- సత్తు మల్లేశం, జిల్లా గ్రంథాలయ చైర్మన్
జ్ఞానం, ఆలోచన, చైతన్యం పంచే ఆలయాలు గ్రంధాలయాలు. పుస్తకాలు చదవడంపై ఆసక్తిని కలిగించి అందరినీ మరింత ఉన్నత విజ్ఞానవంతులుగా చేయడమే మా లక్ష్యం. పౌరులు, విద్యార్థులు, మేధావులు, నాయకులు, అధికారులు, పాఠకులు, గ్రంధాలయాల అభిమానులు వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలి.