Share News

ఓట్ల రాజకీయంతోనే ‘విమోచన’ంగా జరపడం లేదు..

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:51 AM

ఓట్ల రాజకీయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవంగా జరపడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.

ఓట్ల రాజకీయంతోనే ‘విమోచన’ంగా జరపడం లేదు..

సిరిసిల్ల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓట్ల రాజకీయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవంగా జరపడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ బీజే పీ ఒత్తిడితోనే ఈనెల17న అధికారికంగా నిర్వహించేందుకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగివచ్చిన విమో చన దినోత్సవం పేరుతో మాత్రం జరపడం లేదన్నారు. గత సంవత్స రం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. కర్ణాటక, మహారా ష్ట్రలో అధికారికంగా విమోచన దినోత్సవంగానే జరుపుతున్నారన్నారు. ప్రభుత్వం పేరు మార్చకుండా విమోచన దినోత్సవంగానే జరపాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌లో 1948లో చేపట్టిన ఆపరేషన్‌ పోలోతో తెలంగాణా ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువ ాత తెలంగాణలో నిజాం సంస్థానం అరాచక పాలన కొనసాగించింద న్నారు. వల్లభాయ్‌ పటేల్‌ ప్రత్యేక చొరవతో భారత సైన్యం నిజాం సం స్థానంపై దండెత్తిందని, దాంతో 1948 సెప్టెంబరు 17న నిజాం తల వంచాడని గుర్తుచేశారు. అప్పటినుంచి సెప్టెంబరు 17న రాష్ట్ర ప్రభు త్వం విమోచన దినోత్సవంగా అధికారికంగా జరపాలని ఎంతో మంది బీజేపీ నాయకులు పోరాటం చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎంఐఎం నేతలకు కేసీఆర్‌ తలొగ్గి సమైక్య దినోత్సవంగా జరిపారని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటు రాజకీయాల కోసం విమోచన దినో త్సవాన్ని జరపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను ముమ్మాటికి విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ సంస్థానంలో భాగమై కర్నాటక, మహారాష్ట్రలో కలిసిన జిల్లాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విముక్తి దినోత్సవాల ను నిర్వహిస్తున్నాయన్నారు. 2014లో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సె ప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించుకోవచ్చని ప్రజలు అనుకున్నారని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వంద్వ వైఖరి వల్ల తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలే అయ్యా యన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే ఓవైసీలకు తలొగ్గి ఎంఐఎం కు భయపడి ప్రజల ఆకాంక్షలను వమ్ము చేశారన్నారు. సమావేశంలో బీజేపీ పార్లమెంట్‌ కోకన్వీనర్‌ ఆడెపు రవీందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు శీలం రాజు, ఉపాధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి, కార్యదర్శి కర్నె హరిష, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మీడియా కన్వీన ర్‌ కాసుగంటి రాజురావు, కార్యదర్శి భాగయ్య, కౌన్సిల్‌ సభ్యుడు నాగుల శ్రీనివాస్‌,చందుపట్ల లక్ష్మారెడ్డి, గంభీరావుపేట్‌, వీర్నపల్లి మండల అధ్య క్షుడు కోడె రమేష్‌, లకుపతి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 12:51 AM