Share News

బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:01 AM

జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యం లో బుధవారం తెలంగాణ విమోచన దినో త్సవం ఘనంగా నిర్వహించారు.

బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యం లో బుధవారం తెలంగాణ విమోచన దినో త్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ కా ర్యాలయంపైన జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయి న గోపి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. పాతబస్టాండ్‌ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ జాతీ య జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళుల ర్పించి దేశ మాజీ కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహానికి, సమీపంలోని కెప్టెన్‌ రఘునందన్‌ విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా ప్ర ధానకార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు శీలం రాజు, గూడూరి భాస్కర్‌, రాష్ట్ర, కౌన్సిల్‌ సభ్యు లు మ్యాన రాంప్రసాద్‌, నాగుల శ్రీనివాస్‌, బర్కం లక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు మోర శ్రీహరి, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

వేములవాడ టౌన్‌ : వేములవాడ బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. మండలంలోని నందికమాన్‌ చౌరస్తావ ద్దకు బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమంలో బీజేపి రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్‌, చింతపల్లి వెంకటేశ్వర్‌రావు, శంకర్‌, జింక అనిల్‌, గుండెకార్ల లక్ష్మణ్‌, ఏరెడ్డి రాజిరెడ్డి, రమేష్‌, గోనే భాస్కర్‌, వేముల నాగరాజు ఉన్నారు.

రుద్రంగి : మండల కేంద్రంలోని తెలంగాణ విమోచన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కర్నవ త్తుల వేణు, పడాల గణేష్‌, బాలకిషన్‌రావు, తదిత రులు పాల్గొన్నారు.

కోనరావుపేట : మండల కేంద్రంలో భారతీ య జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు మిరియాల బాలాజీ, నాయకులు గొట్టే రామచంద్రం, బైరగోని సురేష్‌ గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ తీగల రవీందర్‌ గౌడ్‌, పరుశురాములు, జింక వెంకటి, మోత్కు మో హన్‌, పున్న మహేష్‌, దుర్గం తిరుపతి ఉన్నారు.

వేములవాడ : తెలంగాణ విమోచన వేడు కలను బుధవారం పట్టణంలోని పాత ఆంధ్రా బ్యాంకు కూడలి వద్ద నిర్వహించారు. బీజేపీ సీని యర్‌ నేత ప్రతాప రామకృష్ణ జాతీయ జెండా ఆవి ష్కరించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్‌, రేగుల మల్లికార్జున్‌, గోపు బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గంభీరావుపేట : గంభీరావుపేటలో బుధవా రం బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినో త్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధులు దెవసా ని కష్ణ, ప్రసాద్‌రెడ్డి, గంట అశోక్‌, మల్లేశయాదవ్‌, ఎలెందర్‌, నాగరాజు, రాజేందర్‌రెడ్డి, సర్వోత్తం, సత్య నారాయణ తదితరులు ఉన్నారు.

వేములవాడ రూరల్‌ : తెలంగాణ రాష్ట్ర వి మోచన వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. రూరల్‌ మండల పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేష్‌ ఆధ్వర్యంలో జాతీయజెండా ఎగురవేసి జెండా వందనం చేశారు.

Updated Date - Sep 18 , 2025 | 12:01 AM