Share News

పరిషత్‌ ఎన్నికలకు ఐక్యంగా ముందుకు పోదాం..

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:25 AM

ఎన్నికల వరకే కొట్లాటలు, పంచాయతీలు ఉండాలని, అందరు సమన్వయంతో రాబోయే పరిషత్‌ ఎన్నికల్లో పనిచేయాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు.

పరిషత్‌ ఎన్నికలకు ఐక్యంగా ముందుకు పోదాం..

సిరిసిల్ల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వరకే కొట్లాటలు, పంచాయతీలు ఉండాలని, అందరు సమన్వయంతో రాబోయే పరిషత్‌ ఎన్నికల్లో పనిచేయాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను సన్మానించారు. పంచాయతీ ఎన్నికల్లో అద్భుతంగా శక్తియుక్తిని ప్రదర్శించి సర్పంచ్‌, వార్డుసభ్యులు, ఉపసర్పంచులు గా గెలుపొందారని అభినందించారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడం వేరు, పంచాయతీ ఎన్నికల్లో గెలవడం వేరన్నారు. కరీంనగర్‌ పార్ల మెంట్‌లో ఏమీ చేయకపోయినా ఒకరు గెలుస్తున్నాడన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెల వాలంటే ఒక్కో మనిషిని పట్టుకోవాలి.. ఒప్పించుకోవాలన్నారు. కొన్ని ఓట్లతో కొందరు, టాస్‌ వేసి గెలిచిన వాళ్లు ఉంటారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 117 గ్రామపంచా యతీలు ఉంటే బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు పది సీట్లు కూడా గెల వలేదని, ఇప్పడు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో ఉన్న 80 గ్రామా ల్లో గులాబీ జెండా ఎగిరిందన్నారు. ఇది పార్టీ నాయకత్వం, మీ గొప్పతనం అని కొని యాడారు. అధికారంలో కాంగ్రెస్‌ ఉన్న క్షేత్రస్థాయిలో గులాబీ కండువా, జెండా, కేసీఆర్‌పై ఉన్న నమ్మకమన్నారు. నియోజకవర్గంలో ఐదు జడ్పీటీసీలు, ఎంపీటీసీలను గెలుచుకునే విధంగా క్లస్టర్ల వారిగా టీములుగా ఏర్పడి గెలుచుకునే దిశగా ఆలోచనలు మొదలు పెట్టాలన్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు పార్టీ ప్రతిష్టకు సం బంధించిన అంశమని ఐకమత్యంగా ముందుకు పోదామని, ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు ఒకవేళ ప్రభుత్వం పెడితే కొట్లాడుదామని లేని పక్షంలో జనవరి మాసంలోనే కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త గ్రామ, మండల, జిల్లా కమిటీలను కొత్తతరం, పాతతరం అందరిని కలుపుకునే విధంగా వేసుకుందామన్నారు. జనవరి మాసంలో సర్పంచులు ఉపసర్పం చులు, వార్డు సభ్యులు కూడా పార్టీ పనిలో పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని అన్నారు. ముఖ్యమంత్రి ఊరూరూ తిరిగినా విజయ ఉత్సవం పేట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బెదిరించినా అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం ఓడించారన్నారు. రాబోయే రెండున్నర ఏళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారంగా రావాల్సిన పైసలు ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా నేరుగా వస్తాయని వాటిని ఎవరూ అడ్డు కునే అధికారం లేదన్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు తరువాత గెలి చిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులకు పంచాయతీ రాజ్‌ చట్టానికి సంబంధించి న నిపుణులు, నిష్ణాతులతో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు పెడతామని అన్నారు.

గడ్డిపోచలాంటి పదవుల కోసం దిగజారుడా..!

పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్‌ఎస్‌ నుంచి అక్రమంగా ఎత్తుకు పోయిన పదిమంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని, అప్పుడు ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయిస్తారని కేటీఆర్‌ అన్నారు.పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయన్నారు. గతంలో మంత్రులుగా, స్పీకర్‌లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటివారు కేవలం గడ్డిపోచలాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహుల్‌ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్‌ విచారణలో మాత్రం తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వీరి బతు కులు పూర్తిగా ఆగమైపోయాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో స్పీకర్‌ ఆధా రాలను పక్కనపెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశా రు. అటలో అంపైర్‌గా ఉండాల్సిన స్పీకర్‌ కూడా తాము ఇచ్చిన ఆధారాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని అన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో రేవంత్‌రెడ్డి మొదట కాంగ్రెస్‌ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారని, సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారన్నారు. నిజంగానే 66 శాతం ప్రజాధరణ ఉంటే, తమ పార్టీ నుంచి ఎత్తుకెళ్లిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ముఖ్యమంత్రి తన సవాల్‌ స్వీకరించాలన్నారు. రైతులను, మహిళలను, బీసీలను మోసం చేసినందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారని స్పష్టం చేశారు. సిరిసిల్లలో 117 పం చాయతీలకు 80చోట్ల బీఆర్‌ఎస్‌ గెలవడమే దీనికి నిదర్శనమని అన్నారు. బెదిరింపులకు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలన్నారు. వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుందామని, పార్టీని మరింత బలోపే తం చేస్తామన్నారు. రాబోయే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఇదే ప్రభంజ నం కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు,బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామా రావు, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ప్రవీణ్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, అరుణ, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మండలాల అధ్యక్షులు వెంకటస్వామి, కృష్ణ హరి, సురేందర్‌రావు, రాజిరెడ్డి, నారాయణరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:25 AM