పోయిరావమ్మా.. గౌరమ్మా..
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:22 AM
తీర్కొపూలతో రాజన్న సిరిసిల్ల జిల్లా మురిసి పోయింది.. పోయిరావమ్మా... గౌరమ్మా... మళ్లీ రావమ్మా.. బతుకమ్మా.. అంటూ మహిళలు బతుకమ్మలను సాగనంపారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
తీర్కొపూలతో రాజన్న సిరిసిల్ల జిల్లా మురిసి పోయింది.. పోయిరావమ్మా... గౌరమ్మా... మళ్లీ రావమ్మా.. బతుకమ్మా.. అంటూ మహిళలు బతుకమ్మలను సాగనంపారు. మంగళవారం సద్దుల సంబురంతో తొమ్మిదిరోజుల పాటు వైభవంగా జరిగిన పూల పండుగ మురిసిపోయింది. అందాల బతు కమ్మ సొగసు చూసి ఆడపడు చులు పులకరించి పోయా రు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, గడ్డిపూల తో పాటు తీరొక్క పూల తో తెలంగాణ సంస్కృతి, వైభవానికి నిలువెత్తూ నిదర్శనం గా బతుకమ్మ పూలతో పుడమి తల్లికి పుష్పార్చన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ చుట్టూ భక్తి, ఆనందోత్సాహాలతో పల్లె, పట్టణ కూడళ్లలో మధురంగా వినిపించిన పాటలు ఆటకు మహి ళలు, యువతులు, చిన్నారులు, చప్ప ట్లతో జతకలిసి అడుగులు వేశారు. కులాలకతీతంగా ఇచ్చి పుచ్చుకున్న వాయినాలు ఆత్మీయతకు దర్పణం పట్టాయి. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలైన సంబరాలను తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన సద్దుల బతు కమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటిలో పసుపు పారబోసినట్లు తంగేడు, బంతి పూలు, ఏ దిక్కున చూసినా పలకరింపులుగా కట్ల పూలు, గుమ్మంలోంచి తొంగి చూసిన గునుగులు, మందారాలు పరిమళించాయి. బతుకమ్మ ఘాట్ వద్ద మానేరు వాగు నీటిలో బతుకమ్మను నిమజ్జనం చేశారు.