Share News

పోరాడి హక్కులను సాధించుకుందాం

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:43 AM

బీసీల 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్యలు వద్దని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి రిజర్వేషన్లను సాధించుకుందాం అని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్‌ పంతం రవి పిలుపునిచ్చారు.

పోరాడి హక్కులను సాధించుకుందాం

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : బీసీల 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్యలు వద్దని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి రిజర్వేషన్లను సాధించుకుందాం అని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్‌ పంతం రవి పిలుపునిచ్చారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో మనస్థాపం తో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా సంతాపం తెలుపుతూ ఆదివారం జిల్లా కేంద్రం అంబే ద్కర్‌ చౌరస్తాలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వ ర్యంలో బీసీ సంఘాల జిల్లా నాయకులు ఆయన చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతం రవి, బీసీ సంఘాల జిల్లా నాయకులు మాట్లా డారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరని నిరసిస్తూ సాయి ఈశ్వరచారి ఆత్మహు తి చేసుకున్నాడని అన్నారు. బీసీ హక్కుల కోసం సాయి ఈశ్వరచారి అమరత్వం పొందడం బాధాకరమన్నారు. పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోవాలని ఆత్మహత్యలు చేసుకోవడం సరైన విధానం కాదన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు బీసీల పట్ల సవతితల్లి ప్రేమను ప్రదర్శించడం దుర్మార్గంన్నారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ప్రభు త్వం శీతాకాలం పార్లమెంట్‌ సమావేశా ల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై స్పష్టమైన వైఖరిని చెప్పా లని డిమాండ్‌ చేశారు. సాయి ఈశ్వరచారి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోటి రూపా యల ఎన్‌గ్రేషియాతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య, బుర్ర మల్లేశం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యు డు గుంటి వేణు, బీసీ నాయకులు సోమ నాగరాజు, రజని, సాగర్‌, శ్రావణపల్లి రాకేష్‌, గుండ్రేటి రాజు, సబ్బ ని రాకేష్‌, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 12:43 AM