Share News

డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలిద్దాం

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:55 AM

డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలించి భావి తరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు.

డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలిద్దాం

సిరిసిల్ల, క్రైం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలించి భావి తరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతిఒక్కరు నడుం బిగించాలన్నారు. అడ్మినిస్ట్రేషన్‌ అధికారి పద్మ, సీఐలు నటేష్‌, రవి, ఆర్‌ఐలు రమేష్‌, మధుకర్‌, యాదగిరి, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, ప్రేమానం దం, జునైద్‌, శ్రవణ్‌, శ్రీనివాస్‌, రమేష్‌, పోలీస్‌ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తంగళ్లపల్లి : డ్రగ్స్‌ నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. బుధ వారం మండలంలోని ఇందిరమ్మకాలనీ శివారులోని రవాణా శాఖ వాహనాల డ్రైవింగ్‌ టెస్ట్‌ గ్రౌండ్‌లో రవాణా శాఖ అధికారులు వాహ నదారులతో డ్రగ్స్‌ నిర్ములన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్‌, సహయక మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి ప్రమీల, కానిస్టేబుల్‌ సౌమ్మ, హోంగార్డ్‌ ఐలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:55 AM