Share News

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:22 AM

బాలకార్మిక వ్యవస్థను రూ పుమాపుదామని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు.

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం

సిరిసిల్ల క్రైం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): బాలకార్మిక వ్యవస్థను రూ పుమాపుదామని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ -11 కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయి స్తే క్రిమినల్‌ కేసులు తప్పవన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూలై 1నుంచి 31వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌ ముస్కా న్‌-11 కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయ వంతం చేయాలన్నారు. ఆపరేషన్‌ స్మైల్‌-11లో పాలుపంచుకున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రూపొందించుకొని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనందన్నారు. బాల్యాన్ని అనుభవించడం ప్రతి పౌరుని హక్కు అని, క్షణికావేషంలో పిల్ల ల తొందరపాటుతో చిన్నచిన్న విషయాలకే తల్లిదండ్రులను విడి చి ఇంటికి దూరంగా ఉంటున్నారన్నారు. ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిచే పనులు చేయిస్తూ వారి జీవి తాలతో ఆడుకుంటున్నారన్నారు. బాలకార్మికులు కనిపిస్తే వెంట నే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. బాలకార్మికులు కనిపిస్తే 1098కు వెంటనే సమాచారం అందిం చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారికి చట్ట ప్రకారం శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ సబ్‌ డివిజన ల్‌లో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు, హోటల్స్‌, వ్యాపా ర సముదాయాలు, మేకానిక్‌ షాపులు, ఇటుక బట్టీల వద్ద తని ఖీలు నిర్వహించాలన్నారు. పాఠశాలలకు వెళ్లకుండా వివిధ కార ణాల వల్ల డ్రాపౌట్‌ అయిన పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పి తిరిగి పాఠశాలలకు పంపే విధంగా ఏర్పాటుచేసి వారికి కొత్త జీవితాలను ఇవ్వాలన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గత ఏడాది జూలైలో పిల్లలతో పనిచేయిస్తున్న వారిపై 21మందిపె,ౖ ఈ ఏడాది జనవరిలో 8మందిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేశామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటే శ్వర్లు, డీఆర్‌డీవో శేషాద్రి, సిఐలు నటేశ్‌, నాగేశ్వర్‌రావు, అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి నజీర్‌అహ్మద్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారి డాక్టర్‌ నయుమ్‌ జహా, విద్యశాఖ అధికారి సతీష్‌ కుమార్‌, షీటీం ఏఎస్‌ఐ ప్రమీలలు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:22 AM