పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:08 AM
పోలీసు అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మానకొండూర్‌లో ఎస్సై సంజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మానకొండూర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : పోలీసు అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మానకొండూర్‌లో ఎస్సై సంజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సేవలు మరువలేనివన్నారు. యువత కష్టపడి చదివి ఉన్నతశిఖరాలను అదిరోహించాలని, దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ సంజీవ్, ఎస్సై స్వాతి, సంజీవ్ సోదరుడు శంకరయ్య, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.