Share News

కలిసికట్టుగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిద్దాం

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:38 AM

కలిసికట్టుగా మందుకు సాగి పం చాయతీ ఎన్నికలో విజయం సాధిద్దామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

కలిసికట్టుగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిద్దాం
మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌ కుమార్‌

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

కోరుట్ల నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కలిసికట్టుగా మందుకు సాగి పం చాయతీ ఎన్నికలో విజయం సాధిద్దామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని సినారే కళా భవ నంలో కోరుట్ల నియోజకవర్గ ఇనచార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొన్ని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎంపి కైన నందయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీకి పునాది లాం టివని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్విన్ని ఏర్పాటు చేసుకున్నా మని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్‌ బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపునకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పన్నాల అంజిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చెర్మన్‌ శీలం వేణుగోపాల్‌, మాజీ కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, నాయకులు తిరుమల గంగాధర్‌, గడ్డం వెంకటేష్‌గౌడ్‌, ఎలే టి మహిపాల్‌రెడ్డి, అన్నం అనిల్‌, ఆకుల లింగారెడ్డి, ఎంబేరి సత్య నారాయ ణ, ఎడ్ల రమే ష్‌, గడ్డం కిరణ్‌, మచ్చ కవిత, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:38 AM