Share News

కుష్ఠు వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:30 AM

కుష్ఠు వ్యాధిని ప్రారం భంలోనే గుర్తించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రజిత అన్నారు.

కుష్ఠు వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించాలి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కుష్ఠు వ్యాధిని ప్రారం భంలోనే గుర్తించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రజిత అన్నారు. మంగళ వారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్‌వో అధ్యక్షతన సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ రజిత మాట్లాడారు. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 నుంచి 31వరకు ఎల్సిడిసి లెప్రసీ సర్వే నిర్వహించాలన్నారు. కుష్ఠు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లిప్రే అనే బాక్టీరియా వల్ల వస్తుందన్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా చర్మం నరాలకు సోకుతుందని అన్నారు. ఈ వ్యాధి బహిర్గతం కాడానికి దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాల వ్యవ ధి పడుతుందన్నారు. కుష్ఠు వ్యాధి అనేది ఎవరికి శాపం పాపం కాదని బహుళ ఔషధ చికిత్స ద్వారా ఆరు నెలలు నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేయవచ్చునని అన్నారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభంలోనే గుర్తి స్తే ఏండీటీ చికిత్సతో అంగవైకల్యానికి దారి తీయదని ఒకవేళ చికిత్స పూర్తి అయిన కుష్ఠు వ్యాధి రోగులకు అంగవైకల్యం ఏర్పడితే శస్త్ర చికి త్స ద్వారా నయం చేయవచ్చునని తెలిపారు. కుష్ఠు వ్యాధి లక్షణాల్లో ముందుగా రాగి రంగులో మచ్చల వస్తాయని, ఆ మచ్చలపై స్పర్శ ఉండదని అన్నారు. ఈ లక్షణాలు ఉన్న రోగులు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలన్నారు. ఈనెల 18 నుంచి పట్టణాలు, గ్రామాలలో ఆశా, ఏఎన్‌ఎంలు ఇంటింటికి సర్వే నిర్వహి స్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఈ సమావేశంలో పోగ్రాం ఆఫీసర్‌లు అనిత, నాగేంద్రబాబు, డీపీఎంవోలు చేపూరి చేపూరి శ్రీనివాస్‌, దేవిసింగ్‌ డెమో రాజ్‌కుమార్‌, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:31 AM