Share News

ముందే గుర్తిస్తే కుష్ఠును నయం చేయొచ్చు

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:09 AM

కుష్ఠు వ్యాధిని ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కుష్ఠు వ్యాది నివారణ నోడల్‌ పర్సన్స్‌కు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ముందే గుర్తిస్తే కుష్ఠును నయం చేయొచ్చు
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ

సుభాష్‌నగర్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కుష్ఠు వ్యాధిని ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కుష్ఠు వ్యాది నివారణ నోడల్‌ పర్సన్స్‌కు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల చర్మానికి నరాలకు సోకుతుందని తెలిపారు. ఈ క్రిమి మానవ శరీరంలో ప్రవేశించిన తరువాత వ్యాధి నిరోధక శక్తిని అనుసరించి లక్షణాలు బహిర్గతం కావడానికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. లక్షణాలు ముందే గుర్తిస్తే పూర్తి చికిత్స పొంది వ్యాధిని నయం చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుధ మాట్లాడుతూ స్పర్శ లేని మచ్చలు కలిగిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కుష్ఠు వ్యాధి అని నిర్దారిస్తే ఐదు మచ్చలలోపు ఉంటే ఆరు నెలల చికిత్స, ఐదు మచ్చలకంటే ఎక్కువ ఉంటే 12 నెలలు చికిత్స తీసుకొని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపును ఈనెల 17 నుంచి 30 వరకు నిర్వహిస్తారని, ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళతారన్నారు. ఏమైనా మచ్చలు ఉన్నట్లైతే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లెప్రసీ న్యూక్లియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నిక్కత్‌, డీఐవో డాక్టర్‌ సాజిదాఅతహరి, సర్వేలెన్స్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అతుల్‌ నిగమ్‌, డెమో రాజగోపాల్‌, డీపీవో స్వామి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కైక పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:09 AM