హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన న్యాయవాదులు
ABN , Publish Date - May 02 , 2025 | 12:53 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నామవరపు రాజేశ్వర్‌రావును సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హైద్రాబాద్‌లోని హైకోర్టు లో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరాజరాజేశ్వరస్వామి చిత్రపటం, స్వామివారి ప్రసాదం అందజేశారు.
సిరిసిల్ల క్రైం, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నామవరపు రాజేశ్వర్‌రావును సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హైద్రాబాద్‌లోని హైకోర్టు లో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరాజరాజేశ్వరస్వామి చిత్రపటం, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జె.శ్రీనివాసరావును, సచివాలయంలో న్యాయశాఖ కార్య దర్శి ఆర్.తిరుపతిని న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో రూ.86.74కోట్లతో నిర్మించే న్యాయ నిర్మాణ్ నూ తన భవనానికి వెంటనే టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించాలని, కరీంనగర్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కోర్టును విభజించి సిరిసిల్లలో నూతనం గా ఎస్సీ, ఎస్టీ కోర్టును ఏర్పాటుచేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజేశ్వర్‌రావు, జస్టిస్ శ్రీనివాసరావులను, జూనియర్‌లకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిని న్యాయవాదులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి, ఉపాధ్యక్షులు ఎస్. అనిల్‌కుమార్, కోశాధికారి వే ముల నరేశ్, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శి నర్మెట్ట రమేశ్, గ్రంథాల య కార్యదర్శి వుచ్చిడి శరత్‌రెడ్డి, మహిళా ప్రతినిధి ఎం. పుష్పలత, సీనియర్ న్యాయవాదులు జనార్ధన్‌రెడ్డి, అన్నల్‌దాస్ వేణు, కడగండ్ల తిరుపతి, బూర్ల కళ్యాణి, బి. అనీలలు పాల్గొన్నారు.