భూ సమస్యలు పరిష్కరించుకోవాలి
ABN , Publish Date - May 13 , 2025 | 11:42 PM
భూ భారతి చట్టం(ఆర్వోఆర్) రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని దుద్దెనపల్లి, బొమ్మకల్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు.
సైదాపూర్, మే 139ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టం(ఆర్వోఆర్) రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని దుద్దెనపల్లి, బొమ్మకల్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. రైతుల వద్దనుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కును కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు సమర్పించడానికి వీలు కాని వారు తరువాత దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వచ్చే అధికారులకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్లు శ్రీనివాస్, కనకయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.