భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:06 AM
భూ భారతి చట్టం ద్వారా గతం లో ఉన్న భూ సమస్యలకు ఒక పరిష్కారం మార్గం ఏర్పడుతుందని వేములవాడ ఎమెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టం ద్వారా గతం లో ఉన్న భూ సమస్యలకు ఒక పరిష్కారం మార్గం ఏర్పడుతుందని వేములవాడ ఎమెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవా డ రూరల్ మండలం హన్మాజిపేటలో బుధవారం భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రభు త్వవిప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూ భారతి చట్టాన్ని తీసువచ్చిందన్నారు. భూ సమస్యలతో బాధపడే వారంతా చట్టాన్ని సద్వినియోగం చేసుకొని హక్కులు పొందాలని పిలుపునిచ్చారు. రైతులకు ఉచిత న్యాయ సహా యం అందజేస్తారన్నారు. ప్రజా ప్రభుత్వంలో 20వేల కోట్ల పైచిలుకు రూపాయలతో 2లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కి సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయా ణంలాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. హన్మాజీపేట్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకవచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ధరణిని అడ్డంపెట్టుకొని చాలావరకు భూములను గ్రామాల్లో పట్టణాల్లో దోచుకున్నారన్నారు. ఆనాడు అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖా తంలో కలుపుతామని ఇచ్చిన మాట ప్రకారం భూభారతి తీసుకవచ్చా మన్నారు. రాబోవు రోజుల్లో ప్రజా ప్రభుత్వంలో అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. గతంలో తాను ముమ్మాటికీ భారతీయుడినని అని ప్రగల్భాలు పలికిన వ్యక్తి కూడా న్యాయస్థానంకు తలవంచి 30లక్షల చెల్లించారన్నారు. పొట్టొన్ని పొడుగోడు కొడితే పొడు గోన్ని పోచమ్మ కొట్టినట్లు ఇక్కడ కూడా అలాగే జరిగిందన్నారు. పజలం తా అప్రమత్తంగా ఉండాలి. 15 సంవత్సరాల తర్వాత అయినా న్యాయం గెలిచిందన్నారు. రాజకీయలకతీతంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నా రు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ధరణి స్థా నంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూ భారతి రాష్ట్ర ప్రభుత్వం అమ లులోకి తీసుకవచ్చిందని తెలిపారు. రెండు చట్టాల మధ్య తేడాలను వివరించారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంద ని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చెయ్యడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ జియో ట్యాగింగ్‌తో పాస్‌బుక్కులు జారీచేస్తారని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారని, భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని వివరించారు. ఏఎమ్‌సీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ అర్బన్, రూరల్ తహసీల్దార్లు విజయ్ ప్రకాష్‌రావు, అబూబాకర్, ఏవో సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.