జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:44 PM
జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు.
కరీంనగర్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూఊ దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని, జిల్లాల వారిగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో జాప్యం జరుగవద్దని సీఎం స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అఽభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, డీఎఫ్‌వో బాలమణి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.