Share News

రుద్రంగిలో ఘనంగా లక్ష్మీనర్సింహ స్వామి జాతర

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:29 AM

మండల కేంద్రంలోని ప్రహ్లా దపర్వతంపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భక్తులు బారులు తీరారు.

రుద్రంగిలో ఘనంగా లక్ష్మీనర్సింహ స్వామి జాతర

రుద్రంగి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని ప్రహ్లా దపర్వతంపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భక్తులు బారులు తీరారు. ప్రతిసంవత్సరం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రుద్రంగి లో లక్ష్మీనర్సింహస్వామి బ్రహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి తీరునాళ్లు, గరుడ సేవా, రాత్రి సమయంలో నిత్యవైష్ణవులతో యక్షజ్ఞానం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కోవె లపై భక్తులు బారులుతీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఆలయకమిటీ చైర్మన్‌ కొమిరె శంకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులు లక్ష్మీనర్సింహస్వామివారికి కట్నకానుకలు సమర్పించారు. మహిళలు స్వామివారికి ఒడి బియ్యాన్ని సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. అలాగే వేములవాడ నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సందర్శించి ఆలయంలో దీపాలు వెలిగించారు. జాతరలో అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 12:29 AM