Share News

కపట ప్రేమతో కేటీఆర్‌ ఉత్తరం

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:52 PM

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ ఆర్‌ డిప్యూటీ సీఎంకు కపట ప్రేమతోనే ఉత్తరం రాశారని, ఈ విష యమై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజ కవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

కపట ప్రేమతో కేటీఆర్‌ ఉత్తరం

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ ఆర్‌ డిప్యూటీ సీఎంకు కపట ప్రేమతోనే ఉత్తరం రాశారని, ఈ విష యమై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజ కవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాష్ట్రం అప్పులపాలు కావడానికి, సిరిసిల్లలో బకాయిల పెరగడానికి కారణం కేసీఆర్‌ పాలన అని ఆరోపించారు. సిరిసిల్ల నేత కార్మికులకు కేటీఆర్‌ చేసిందేమీలేదని, సిరిసిల్ల పద్మశా లిల జీవితాలు బాగుపడినట్లు అయితే ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో కేటీఆర్‌ ఆలోచన చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవి నీతి అక్రమ పాలన వల్ల ఈ రాష్ట్రంపైన రూ.8లక్షల కోట్లు అప్పులు పెట్టిందని ఆరోపించారు. రూ.45వేల కోట్ల నుంచి 50వేల కోట్ల వరకు బకాయిలను పెట్టిందన్నారు. సిరిసిల్ల ప్రాంతంపైన కేటీఆర్‌కు నిజం గా ప్రేమ ఉంటే రాజకీయ జీవి తాన్ని ఇచ్చిన పద్మశాలీల జీవితాల ను బాగుపరచాలన్నారు. సిరిసిల్లలో ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికి కూడా ప్రభుత్వం తమ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది కాబ ట్టి బేషజాలకు వెళ్లకుండా బతుకమ్మ చీరల బకాయిలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాక ప్రభుత్వ శాఖల డ్రెసకోడ్‌ కోసం నేతన్నల దగ్గర నుంచి వస్త్రాల ను కొనుగోలు చేయాలని జీవో నంబర్‌ 1ను తీసుకవచ్చిందన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీని తీసుకొచ్చి రూ.37.50కోట్లను చెల్లించిందన్నారు. త్రిఫ్ట్‌ సెకండ్‌ ఫేస్‌ కింది రూ.12కోట్లు చెల్లించిందన్నారు. వేములవాడ లో యారన్‌ డిపోను ఏర్పాటు చేసి రూ.50కోట్లు వెచ్చించి ఆసాముల చిరుకాల కోరికను నేరవేర్చగా ఇప్పటివరకు రూ.2253 మెట్రిక్‌ టన్ను ల యారన్‌ను సబ్సిడీ ద్వారా ఇచ్చిందన్నారు. బతుకమ్మ చీరలలో నా ణ్యత లోపాలతో ఉన్నందున్న వాటిని పక్కన బెట్టి ఇందిరా మహిళా శక్తి సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని నాణ్య మైన బట్టలను తయారు చేసే విధంగా రూ. 270 కోట్ల విలు చేసే చీరలను ఉత్పత్తి చేయడం కోసం ఆర్డర్లు ఇచ్చిందన్నారు. దసరా, దీపావళికి ప్రతి మహిళ సంఘాలకు చీరలను ఇవ్వడానికి పనులు వేగవంతంగా నడుస్తున్నాయన్నారు. ఈనెల 26న మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా త్రిఫ్ట్‌ పథకం కింద వారికి రావాల్సిన డ బ్బులు ఇవ్వనున్నామన్నారు. నేతన్న బీమాలో దాదాపు 6వేల మంది చేరారన్నారు. ఒక్కొక్కటిగా పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసుకుం టూ పోతుంటే ఎక్కడ ఉనికిని కోల్పోతామేమో అని కేటీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల పద్మ శాలి సంఘం, వస్త్రవ్యాపారులను బిల్లులు రావని బెదిరించి మర్కం డేయ కండువాలతో పాటు బీఆర్‌ఎస్‌ కండువాలు వేసి ఇంటింటికి ప్రచారానికి తిప్పింది నిజం కాదా అన్నారు. రాజకీయాలు వేరు వ్యా పారాలు వేరు అని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెపుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఉ పాధ్యక్షుడు బొప్ప దేవయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, మార్కెట్‌ కమి టీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, కాసర్ల రాజు,నక్క నర్సయ్య, టీపీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మాజీ కౌన్సిలర్లు యెల్లె లక్ష్మీనారా యణ, ఆడెపు చంద్రకళ,కత్తెర దేవదాస్‌, వెంగళ లక్ష్మీనర్సయ్య, వేము ల రవి, రాగుల జగన్‌, నేరెళ్ళ శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:52 PM