Share News

యూరియా కొరతపై కేటీఆర్‌ సన్నాయి నొక్కులు..

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:57 AM

యూరియా కొరతపై మాజీ మంత్రి కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని.. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు యూరియా ఎక్కడి నుంచి వస్తదో తెలియదా అని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు.

యూరియా కొరతపై కేటీఆర్‌ సన్నాయి నొక్కులు..

ముస్తాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : యూరియా కొరతపై మాజీ మంత్రి కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని.. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు యూరియా ఎక్కడి నుంచి వస్తదో తెలియదా అని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు. ముస్తాబాద్‌లో పోతుగల్‌ దారిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆది శ్రీనివాస్‌తో పాటు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కెకె మహేందర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. యూరియా కొరతపై కేటీఆర్‌ సన్నా యి నొక్కులు నొక్కుతున్నాడని, కేంద్రం అందించాల్సిన యూరియా తెలంగాణకు సరిపడా యూరియాను ఎందుకు అందించడం లేదో, బీజేపీని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటివరకు 5.32లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే వచ్చిం దని 2.69లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా లోటు ఉందని అంకెల రూపంలో ఆది శ్రీనివాస్‌ వివరించారు. దీనిపై కేంద్రాన్ని ఎందుకు నీలదీయడం లేదో కేటీఆర్‌ తెలుపాలన్నారు. కేంద్రం తెలంగాణపైన కక్ష సాధింపు చర్యలుకు దిగుతుంటే బీఆర్‌ ఎస్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. కేటీఆర్‌ ఇప్పటివరకు కేంద్రంపైన నోరు విప్ప డం లేదన్నారు. కాంగ్రెస్‌ వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు అర డజను లేఖలు రాశారన్నారు. సీఏం రేవంత్‌రెడ్డి గత నెల రోజులుగా కేంద్రాన్ని యూరియా కేటా యింపుల పైన అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటులో యూరియా కోసం ఆందోళన చేశామన్నారు. ప్రియంకా గాంధీ స్వయంగా వచ్చి ఏంపీలు ఆందో ళనలో పాల్గొన్నారని బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రైతులు కష్టపడుతుంటే ఎందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆనందిస్తున్నారని తెలంగా ణపై మీకు ప్రేమలేదని విమర్శించారు. సాగుకు అనుగుణంగా ఇండెంట్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్రం అవలంబిస్తున్న వైఖరి కారణంగానే యూరియా కొరత ఏర్పడిందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు సరిపడా యూరియా సమకూర్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కెకె మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైౖర్మన్‌ తలారి రాణిన ర్సయ్య, పార్టీమెంట్‌ కోకన్వీనర్‌ కనమేని చక్రధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్య క్షుడు యెల్ల బాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కలకొండ లక్ష్మీ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు యాదగిరిగౌడ్‌, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్‌, భాను, శీల ప్రశాంత్‌, స్వేఛ్చ, దీటి నర్సింలు, గోవర్ధన్‌, తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం మండల రైతుల వినతి

ముస్తాబాద్‌ మండలంలోని పోతుగల్‌, మోయినికుంట, తెర్లుమద్ది, గన్నెవానిపల్లె రైతులు యూరియా కోసం విప్‌ ఆది శ్రీనివాస్‌కు వినతి చేశారు. యూరియా లేక పంటలు పండే అవకాశం లేకుండా పోతుందని ఇప్పటికే ఆలస్యం అయిందని రైతలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి యూరియా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుండి వెంటనే తెప్పించి రైతులకు అందించాలని ఆదేశించారు.యూరియా కొరత జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:57 AM