Share News

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:35 AM

కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఆదివారం నివాళులు అర్పించారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి
కొండా లక్ష్మణ్‌ బాపూజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ఇంటినే త్యాగం చేసిన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. కేసీఆర్‌ మొట్టమొదట పార్టీ పెడతానంటే తన ఇంటినే టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ (జలదృశ్యం) మార్చి తెలంగాణ రాష్ట్ర అంకురార్పణకు చేసిన మహానీయుడు బాపూజీ అన్నారు. హైదరాబాద్‌ సంస్థాన ప్రజలకు విముక్తికోసం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌పై బాంబు దాడికి వ్యూహం రచించి అమలు చేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్భందించిన నాయకుల కోసం పార్టీలతో నిమిత్తం లేకుండా న్యాయ సాయం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. 96 సంవత్సరాల వయస్సులో తెలంగాణ కోసం జంతర్‌మంతర్‌ వద్ద ఎముకలు కొరికే చలిలో దీక్షా చేశారని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్‌ వై సునీల్‌రావు, వాసాల రమేష్‌; చంద్రశేఖర్‌, నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:35 AM