ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
ABN , Publish Date - Sep 28 , 2025 | 01:21 AM
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణగా ఉంటుందని, తెలంగాణ కోసం, రైతు హక్కు ల కోసం చేసిన పోరాటం ఈ తరానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణగా ఉంటుందని, తెలంగాణ కోసం, రైతు హక్కు ల కోసం చేసిన పోరాటం ఈ తరానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూ జీ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాని కి కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలతో కలిసి పూలమాల వేసి నివాళులు తెలిపారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గోనె ఎల్లప్ప, గోలి వెంకటరమణ, వనిత, సుర దేవరాజు, బొప్ప దేవయ్య పూలమాల వేసి నివాళులు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన సందర్భంగా బీసీ సంఘం అధ్యక్షుడు పర్ష హనుమండ్ల్లు స్వీట్లు పంపిణీ చేశారు.