Share News

కొండా లక్ష్మణ్‌ బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలి

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:36 AM

తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించినట్లు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీని  తెలంగాణ జాతిపితగా గుర్తించాలి
కోరుట్లలో నివాళులర్పిస్తున్న నాయకులు

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

రాయికల్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించినట్లు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘంలో ఆదివారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగా ణ ప్రాంత ప్రజలకు విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరోదారి లేదనుకున్న బాపూజీ తెలంగా ణ ఉద్యమానికి నాంది పలికారని అన్నారు.

కార్యక్ర మంలో రాయికల్‌ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బోగ రాజేశం, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధ ర్‌, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్‌, కోశాధికారి ఆడెపు నర్సయ్య, యువజన సంఘం అధ్యక్షుడు సామల్ల సతీష్‌, పోపా సంఘం బాధ్యుడు దాసరి రామస్వామి, మండల బాధ్యులు గాజెంగి అశోక్‌, యువజన సంఘం ఉపాధ్యక్షుడు సింగని సతీష్‌, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్‌, కోశాధికారి బొమ్మకం టి నవీన్‌, మాజీ అధ్యక్షుడు మ్యాకల కాంతారావు, ఆలయ చైర్మన్‌ దాసరి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల అగ్రికల్చర్‌: మూడు దశల్లో సాగిన తెలంగాణ సాధన ఉద్యమానికి సాక్షిగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉన్నారని జగిత్యాల మున్సిపల్‌ మాజీ ఛైర్‌ప ర్సన్‌ అడువాల జ్యోతి లక్ష్మణ్‌ అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని స్థానిక అంగడిబజార్‌లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం లో పద్మశాలి సేవాసంఘం అధ్యక్షుడు భోగ గంగాధ ర్‌, ఉపాధ్యక్షులు భోగ రాజ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కొడిమ్యాల: మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో సంఘం నాయకులు అంకం జనార్దన్‌, కె సత్యనారాయణ, భూమేష్‌, సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు.

మల్యాల: మండలంలో బ్లాక్‌ చౌరస్తా వద్ద గల కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘ ప్రతినిధులు, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మెట్‌పల్లి టౌన్‌: మెట్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం లో స్థానిక పాత బస్టాండ్‌ శాస్త్రి చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం, మండల అధ్యక్షుడు అంజిరెడి,్డ యూత్‌ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్‌, ఆడెపు రమణ, గాజా రాజా రెడ్డి జాకీర్‌ ముకిం మహేందర్‌ తాండ్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ధ్యావనపెల్లి రాజారాం, పట్టణ వార్డుల కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.

మల్లాపూర్‌: మండల కేంద్రంలో జరిగిన కార్యక్ర మంలో మాజీ జడ్పీటీసీ, కిసాన్‌ సెల్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఏలాల జలపతిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శంకర్‌, నాయకు లు, పద్మశాలిలు, తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: మండలంలోని ఫకీరు కొండాపూర్‌ లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు సింగని మారుతి, నాయకులు పాల్గొన్నారు.

కోరుట్ల/కోరుట్లరూరల్‌: పట్టణంలోని కార్గిల్‌ చౌరస్తా లో జరిగిన కార్యక్రమంలో పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకు డు జువ్వాడి కృష్ణారావు, పద్మశాలి సంఘ పట్టణ అధ్యక్షుడు గుంటుక ప్రసాద్‌, వివిధ పార్టీల నాయకు లు, పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. కోరు ట్ల రూరల్‌ మండలంలోని జరిగిన కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:36 AM