Share News

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:55 AM

ఫామ్‌హౌస్‌లో ఉంటూ చక్రవర్తిలా రా ష్ట్రాన్ని పరిపాలించి అప్పుల కుప్పగా మా ర్చింది మీ నాన్న కేసీ ఆర్‌ కాదా అని కేటీఆర్‌ ను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్‌

వేములవాడ టౌన్‌, ఆగస్టు 29 (ఆంధ్ర జ్యోతి): ఫామ్‌హౌస్‌లో ఉంటూ చక్రవర్తిలా రా ష్ట్రాన్ని పరిపాలించి అప్పుల కుప్పగా మా ర్చింది మీ నాన్న కేసీ ఆర్‌ కాదా అని కేటీఆర్‌ ను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. వేములవాడ పట్టణంలో ని మూలవాగు వద్ద శుక్రవారం గంగమ్మ తల్లికి చీర, పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించా రు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడు తూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని గంగవ్మ తల్లిని వేడుకున్నామ న్నారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ నిర్మించిన నాగా ర్జునసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌, కడెం వంటి ప్రాజె క్టులు చెక్కుచెదరకుండా ఉన్నాయని, లక్ష కోట్ల తో నిర్మించామని గొప్పలు చెబుతున్న కాళేశ్వ రం కృంగిపోయిందని విమర్శించారు. నర్మాల వద్ద పలువురు వరదలో చిక్కుకుంటే కేటీఆర్‌ వచ్చి రాజకీయాల గురించి మాట్లాడారని, వర దల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయడం మరిచిపోయి కేటీఆర్‌ రాజకీయాలు మాట్లాడు తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ వచ్చేటప్పటికే హెలికాప్టర్‌లు వచ్చి బాధితుల ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని, సందర్భం కాకున్న కేటీఆర్‌ బురద రాజకీయాలు చేస్తున్నా రని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశారని గుర్తు తెలిపారు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ కనీసం బ్రిడ్జిలను కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యంవల్ల వరదలు వస్తే సహాయం చేయా ల్సిందిపోయి అక్కడ కూడా సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడం హేయమన్నారు. అసెంబ్లీ సమా వేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చిస్తున్నామని, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడు ముకున్నట్లుగా కేసీఆర్‌, కేటీఆర్‌ కోర్టుకు వెళ్లి కాళేశ్వరం విచారణపై స్టే ఇవ్వాలని అడిగారని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయమని ప్ర శ్నించారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం పై చర్చలో పాల్గొనాలని, బీఆర్‌ఎస్‌ పరిపాలన లో వారు చేసినవన్ని స్కాములేనిని, కాళేశ్వరం, గొర్లు, బర్లు, చాపలు వేటిని వదలకుండా అన్ని స్కాములే చేశారని ఆరోపించారు. కార్యక్రమం లో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ కాంగ్రెస్‌ నా యకులు కనికరపు రాకేష్‌, సంద్రగిరి శ్రీనివాస్‌, చిలుక రమేష్‌, సాగరం వెంకటస్వావి, అక్రమ్‌, నాగుల విష్ణుప్రసాద్‌, బింగి మహేష్‌, పులి రాం బాబు, ఇప్పపూల అజయ్‌, పుల్కం రాజు, అన్నా రం శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:55 AM