Share News

Karimnagar: మహిళా చట్టాలను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:11 PM

గణేశ్‌నగర్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం మహిళా చట్టాలను బలోపేతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద గురువారం నిరసన తెలిపారు.

Karimnagar:   మహిళా చట్టాలను బలోపేతం చేయాలి

- దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి

- ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

గణేశ్‌నగర్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం మహిళా చట్టాలను బలోపేతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ యం. పూజ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినిలకు రక్షణ లేదన్నారు. తక్షణమే దేశవ్యాప్తంగా మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అసెంబ్లీ వినయ్‌సాగర్‌, నాయకులు అక్షయ్‌, మానస, మమత, రమ్య, జ్యోతి, వరలక్ష్మి, రేఖ, శ్రీజ, సంజన, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:11 PM