Karimnagar: మహిళలకు రీస్త్ర్కీనింగ్ పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:13 PM
సుభాష్‌నగర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య మహిళ క్యాంపులో మహిళలకు రీ స్త్ర్కీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు.
సుభాష్‌నగర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య మహిళ క్యాంపులో మహిళలకు రీ స్త్ర్కీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. నగరంలోని బుట్టి రాజారాం అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, ఔట్ పేషంట్ రిజిస్టర్లతోపాటు ఇతర రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, ఏఎన్‌ఎంల వారీగా అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలు పని తీరును సమీక్షించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రమిత వ్యాధులకు సంబందించిన బ్లూ, రెడ్ రిజిస్టర్లలో నమోదు చేసిన అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి గ్రస్తుల వివరాల నమోదు, వారికి అందచేసిన మందుల వివిరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ పీవో డాక్టర్ సనజవేరియా, బిఆర్‌ఆర్ యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, సూపర్‌వైజర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.