Karimnagar: ఎవరి గోల వారిది..
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:15 AM
సైదాపూర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మూడో విడత ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోటీ
- చలి మంటల వద్దకెళ్లి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
సైదాపూర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మూడో విడత ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కంటి మీద కునుకు పట్టడం లేదు. ఎవరు వేస్తారో ఎవరు వేయరో నెమరు వేస్తు, ఓటర్లను ఆకర్శించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గి చలి విపరీతంగా పెడుతండడంతో సాయంత్రం అయిందంటే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామాల్లో మంటలు పెట్టుకొని చుట్టుపక్కల వారు ఒక చోట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. చలి పెడుతున్నదని ప్రజలు మంట పెట్టుకొని చుట్టు కూర్చొని మంట కాగుతుంటే చలి లెక్క చేయకుండా అభ్యర్థులు ఆ మంట వద్దకు వెళ్లి తనకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.