Karimnagar: ఏసు క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:25 AM
కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏసు క్రీస్తు చూపిన మార్గంలో అందరూ నడవాలని దక్షిణ ఇండియా సంఘం మాడరేటర్ డాక్టర్ కె రూబెన్‌మార్క్ అన్నారు.
- ఐక్య క్రిస్మస్ వేడుకల్లో డాక్టర్ కె రూబెన్‌మార్క్
కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏసు క్రీస్తు చూపిన మార్గంలో అందరూ నడవాలని దక్షిణ ఇండియా సంఘం మాడరేటర్ డాక్టర్ కె రూబెన్‌మార్క్ అన్నారు. జ్యోతినగర్‌లో ని దక్షిణ ఇండియా సంఘం అధ్యక్ష మండల సీఎస్‌ఐ స్థానిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమ, పరోపకారం, విశ్వాసం వంటి గుణాలను అలవరుచుకొని ప్రశాంతంగా జీవితాలను కొనసాగించాలన్నారు. అనంతరం క్రిస్మస్ జ్యోతిని వెలిగించారు. క్రైస్తవులు ఆలపించిన కీర్తనలు, చిన్నారుల నృత్యాలు, పాటలు, క్రీస్తు జనన సన్నివేశాలు అలరించాయి. కార్యక్రమంలో సి రాములు ఇమ్మానియేలు, ఎర్ర జాకబ్, డాక్టర్ ఎస్ జాన్, ఆర్ ప్రసాద్, ఆర్ పాల్ కొమ్మాలు, సి సంజయ్, రాబర్ట్ సామ్యూల్, దేవదాసు, సి నారాయణ, ఎం సంజయ్, జి అనిల్, ఎస్ సత్యానందం పాల్గొన్నారు.