Karimnagar: కరీంనగర్ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాం..
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:05 AM
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
- రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకరిస్తున్నారని చెప్పారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బండి సంజయ్ ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 18 ఏళ్లుగా అమ్మవారి మాల వేసుకుని మహా శక్తి ఆలయంలో దీక్ష చేపట్టి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బండి సంజయ్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని ఆయన అన్నారు. తామిద్దరం విద్యార్ధి సంఘం నుంచి ఎదిగిన నేతలమని, ప్రజల సంక్షేమమే తమ ప్రాధాన్యమిని చెప్పారు.
ఫ భగత్‌నగర్: అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పనిచేద్దామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 77 కోట్లు మంజూరు చేయించినందుకు బండిసంజయ్‌కుమార్‌ను బుధవారం మానకొండూర్ ఎమ్మెఏల్య కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో గన్నేరువరం మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అందరి సహకారంతోనే మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమయిందన్నారు. ప్రజల బలమైన కోరిక, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లిసత్యనారాయణ పట్టుదల తనను ముందుకు నడిపించాయన్నారు. అభివృద్ధి పనుల కోసం రాజకీయాలకతీతంగా కలిసి ముందుకు రావాలన్నారు. మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో గన్నేరువరం, బెజ్జంకి ఇల్లంతకుంట, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయన్నారు.