Karimnagar: ‘వందేమాతరం’ ప్రజల భవిష్యత్‌కు భరోసా
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:25 PM
కరీంనగర్ టౌన్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతాలాపన దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు.
- మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ టౌన్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతాలాపన దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో వందేమాతరం గీతం వచ్చి 150వ సంవత్సరం అయిన సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వందేమాతరం గీతాలాపన చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బంకిమ్ చంద్ర చటర్జి రచించిన వందేమాతరం గీతం కోట్లాది ప్రజల గుండె చప్పుడని అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఈ గీతం రణనినాదంగా ఉపయోగపడిందని గుర్తు చేశారు. వందేమాతరం గీతం దేశమాత ఆరాధాన గీతం అన్నారు.
వందేమాతరం గీతం రచించి 150 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా నగరంలోని పలు వీధుల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి, దేశభక్తి నినాదాలుచేశారు. పాఠశాలల్లో సామూహిక గీతాలాపన చేశారు.
ఫ పోలీస్ కమిషనరేట్‌లో..
కరీంనగర్ క్రైం: పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో 150వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శపోలీస్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్‌కమిషనర్ గౌస్ ఆలం పాల్గొని వందేమాతరం గేయాన్ని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సామూహికంగా ఆలపించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఆర్‌ఐ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.