Share News

Karimnagar: రాష్ట్రానికి నిధులు తేని కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:03 AM

భగత్‌నగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి నిధులు తీసుకురాలేని కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు.

Karimnagar:  రాష్ట్రానికి నిధులు తేని కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

భగత్‌నగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి నిధులు తీసుకురాలేని కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. బుధవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులతోపాటు యూరియా తీసుకు రావడంతో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ విఫలమయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా రెండున్నర లక్షల కోట్లరూపాయల భారాన్ని తగ్గిస్తున్నామంటున్నారని, ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లు ప్రజల నుంచి దోచి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మోదీ విధానాల వల్ల భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తన అస్తిత్వాన్ని కోల్పోతోందన్నారు. అమెరికా భారత దేశంపై విమర్శలు చేస్తుంటే ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జి బీమాసాహెబ్‌, సుంకరి సంపత్‌, ఎడ్ల రమేష్‌, కె నాగమణి, డి నరేష్‌ పటేల్‌, పుల్లెల మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:03 AM