Karimnagar: అనుమతి లేని కేబుల్స్‌ను తొలగించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:33 AM
గణేశ్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తొలగించాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు.
- టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
గణేశ్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తొలగించాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన 16 సర్కిళ్ల ఎస్‌ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబుల్ వైర్లు తొలగించమని ఆపరేటర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కేబుల్ వైర్లతో ప్రమాదాల జరుగుతున్నాయన్నారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న లైన్లను సమరించాలని ఆదేశించారు. ఎత్తున్న విగ్రహాల తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
- విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లు తొలగింపు
నగరంలో విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా ఉన్న డిష్ కేబుల్ వైర్లు ఎస్‌ఈ మేక రమేష్‌బాబు అధికారులతో కలిసి తొలగించారు. ఈ సంధర్బంగా ఎస్‌ఈ మేక రమేష్‌బాబు మాట్లాడుతూ రెండు మూడు రోజులలో అన్ని కేబుళ్లను సరి చేసుకోవాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈలు ఉపేందర్, జంపాల రాజం, ఏడీ పంజాల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.