Karimnagar: క్షయ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:25 AM
కరీంనగర్ రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): క్షయతో బాదపడే వారు జాగ్రత్తలు పాటిస్తే ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ అన్నారు.
కరీంనగర్ రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): క్షయతో బాదపడే వారు జాగ్రత్తలు పాటిస్తే ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో చామనపల్లి పీహెచ్‌సీలో టీబీ చాంపియన్స్ శిక్షణ శిబిరం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్షయ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందన్నారు. లక్షణాలు ఉన్న వారు వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నివారణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో చామనపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మనోహర్, టీబీహెచ్‌వీ రవీందర్, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, టీబీ అలర్ట్ ఇండియా సిబ్బంది వనిత, శ్రీను, రాజేందర్, అనిల్ పాల్గొన్నారు.