Share News

Karimnagar: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ గౌస్‌ ఆలం

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:27 PM

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): శిక్షణను సద్వినియోగం చేసుకుని సందేహాలను నివృతి చేసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు.

Karimnagar: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ గౌస్‌ ఆలం

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): శిక్షణను సద్వినియోగం చేసుకుని సందేహాలను నివృతి చేసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. కరీంనగర్‌లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో సెక్టార్‌, ఇన్వెస్టిగేటింగ్‌ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న 35 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు సీపీటీసీలో సోమవారం శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ ఈ శిక్షణలో భాగంగా ఫిర్యాదు అందుకోవడం నుంచి ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఇన్వెస్టిగేటింగ్‌ విధానం, సాక్షుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడం, క్రైమ్‌ సీన్‌ను సందర్శించడం, సాక్ష్యాధారాలు సేకరించడంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనరేట్‌ ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ కుమార్‌, శ్రీనివాస్‌, సరిలాల్‌, బిల్లా కోటేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:27 PM