Karimnagar : మాటల్లో పెట్టి మాయ చేస్తారు..
ABN , Publish Date - May 19 , 2025 | 12:52 AM
కరీంనగర్ క్రైం, మే 17 (ఆంధ్రజ్యోతి): మనుషులను కిడ్నాప్‌చేసి డబ్బులు వసూలు చేయడం ఎక్స్‌టార్షన్ నేరం కిందకు వస్తుంది.
వలపు వలతో నిలువుదోపిడీ
- విలవిలలాడుతున్న బాధితులు
- బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న ముఠాలు
కరీంనగర్ క్రైం, మే 17 (ఆంధ్రజ్యోతి): మనుషులను కిడ్నాప్‌చేసి డబ్బులు వసూలు చేయడం ఎక్స్‌టార్షన్ నేరం కిందకు వస్తుంది. అందమైన అమ్మాయిలను ఎరవేసి, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజడం సెక్స్‌టార్షన్ కిందకు వస్తుంది. తాజాగా పురుషులే మహిళల గొంతుతో వలపు వల విసురుతున్నారు. ఆ వలకు చిక్కుకున్నవారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. సామాజిక మాద్యమాలను కొందరు కేటుగాళ్లు ఈజీమని కోసం ఉపయోగిస్తున్నారు. నమ్మించి, వంచించి అందినకాడికి దోచుకుంటున్నారు. అమ్మాయి పేరుతో వలపు వలలు విసురుతూ అమాయకులను బుట్టలోవేసుకుని అనంతరం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ నిలువుదోపిడి చేస్తున్నారు. మరి కొన్ని ఘటనల్లో హోమో సెక్కువల్స్ ఇదేవిధంగా అమాయకులను మాయా మాటలు చెప్పి దగ్గరికి రప్పించుకుని చిత్రహింసలకు గురిచేసి నిలువుదోపిడికి పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనల్లో బాధితులు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలు జిల్లాలో ఇటీవల తరుచూ జరుగుతున్నాయి.
ఫ పరువు పోతుందని..
మనుషుల బలహీనతలను పెట్టుబడిగా పెట్టి వారితో నేరగాళ్లు ఆటలాడుకుంటున్నారు. ఇటువంటి నేరగాళ్ల బారినపడినవారు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు. నేరగాల్లు అడిగినంత ముట్టజెబుతూ సర్వం కోల్పోతున్నారు. చాలా మంది బాధితులు బయటకు చెప్పుకోలేక లోలోన మధనపడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయనాయకులు కూడా వలపు వలలో చిక్కుకుంటున్నట్లు సమాచారం. బాధలు, వేధింపులు ఎక్కువైన సంఘటనల్లో మాత్రమే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కొత్తపల్లి మండలంలో జరిగిన ఘటనలో ముగ్గురు యువకులు ఒక ముఠాగా ఏర్పడి సామాజిక మాద్యమాల్లో పలువురికి మెస్సేజ్‌లు పంపించారు. మెస్సేజ్‌లకు స్పందించిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని తమ వద్దకు రప్పించుకుని శారీరకంగా, మానసికంగా హింసించి అతడి వద్ద డబ్బులు దోచుకున్నారు. ఈ నేర ఘటనలో పాల్గొన్నవారిలో ఒక నిందితుడు గతంలో చింతకుంటలో ఒక వ్యక్తి వద్ద డబ్బులు దోచుకోగా, మరో కేసులో బెదిరించి డబ్బులు దోపిడీ చేశాడు. జైలుకు వెళ్లివచ్చినా తీరు మార్చకోలేదు. మరో ఇద్దరితో జతకట్టి మళ్లీ అదే విధంగా నేరం చేసి పోలీసులకు చిక్కాడు. ముక్కుమొఖం తెలియని వారితో చాట్ చేసి చిక్కుల్లో పడవద్దని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి కష్టాలు కొనితెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఫ విచ్చలవిడిగా సైబర్ నేరాలు
సైబర్ నేరగాళ్లు కూడా ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్లో పోర్న్‌సైట్, శృంగారపరమైన వీడియోలను వీక్షించేవారి సమాచారాన్ని మొదట సేకరించి అనంతరం వారికి వలపుల వలలు విసిరుతూ మోసాలకు పాల్పడుతున్నారు. పోర్న్‌సైట్, శృంగారపరమైన వీడియోలను వీక్షించేవారి ఫోన్, ఐపీ చిరునామా ద్వారా సైట్ల నిర్వాహకులకు తెలిసిపోతుంది. సైట్ల నిర్వాహకుల ద్వారా సైబర్ నేరగాళ్లు ఆ వివరాలను సేకరిస్తున్నారు. మొదట అందమైన అమ్మాయి డీపీ ఉన్న అకౌంట్ నుంచి హాయ్ అంటూ మెస్సేజ్ పంపిస్తారు. ఆ మెస్సేజ్‌కు స్పందించకుంటే కాల్ చేస్తారు. పోన్‌ఎత్తితే తియ్యటి మాటలతో అమ్మాయి లైన్‌లోకి వస్తుంది. కొద్దిగా పరిచయంకాగానే వీడియోకాల్ మాట్లాడుకుందామంటారు. అందుకు బాధితుడు సిద్ధమవగానే మరింత రెచ్చగొడతాతారు. మాటలతో మభ్యపెట్టి అవతలి వ్యక్తిని నగ్నంగా మారాలని ఉసిగొల్పుతారు. వారిమాటలకు లొంగిపోతే ఇళ్లుగుల్ల అయినట్లే. ఇద్దరి మద్య జరిగే వ్యవహారమంతా రికార్డు చేసి, బెదిరింపులకు దిగుతారు. ఆ తరువాత షరామామూలే.... మీ వీడియోలు మావద్ద ఉన్నాయి... వాటిని యూట్యూబ్‌లో పెడుతాం... అంటూ ఒక లింక్ పంపిస్తారు. అందులో బాధితుడి వీడియోలు దర్శనమిస్తాయి. అడిగినకాడికి ఇవ్వడం తప్ప మరో మార్గం లేకుండా పోతుంది. కొందరు ధైర్యం చేసి పోలీసులను అశ్రయిస్తున్నప్పటికీ ఈ కేసులు బయటకు రావడంలేదు.
ఫ తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులతో ్ల అప్రమత్తంగా ఉండాలి.
- తెలియని నంబర్ల నుంచి వచ్చే అనుమానిత వీడియోకాల్స్, మెస్సేజ్‌లకు ఎట్టి పరిస్థితుల్లో స్పందిచవద్దు.
- తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు స్పందించవద్దు.