Share News

Karimnagar: కొలువుదీరిన గణనాథులు

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:48 AM

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి.

Karimnagar:  కొలువుదీరిన గణనాథులు

- ఘనంగా వినాయక చవితి

- మండపాల వద్ద సందడి

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. మండపాలకు వివిధ రూపాల్లో ఉన్న భారీ గణనాథులను వాహనాల్లో డప్పుచప్పులు, మంగళ వాయిద్యాల మధ్య తరలించి ప్రతిష్టించారు. పలు చోట్ల మట్టి గణపతులను పూజించారు. ఆయా కమిటీల ఆధ్వర్యంలో మండపాలు, ఆలయాల్లో సందడి నెలకొంది. ఎక్కువ సంఖ్యలో వినాయకులను ప్రతిష్టించగా ఆకర్షించే విధంగా ఉన్న వినాయక విగ్రహాలు కనువిందు చేశాయి.

ఫ ప్రకాశంగంజ్‌లో ప్రముఖుల పూజలు...

ప్రకాశం గంజ్‌ వరసిద్ధివినాయక ఆలయం వెనుక స్థానిక వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, కాంగ్రెస్‌ పార్లమెంటరీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు వేర్వేరు సమయాల్లో దర్శించుకుని పూజలు చేశారు.

ఫ కలెక్టరేట్‌లో..

కలెక్టరేట్‌లో అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద కలెక్టర్‌ పమేలాసత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడేతో కలసి పూజలు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఏవో సుధాకర్‌, గెజిటెడ్‌, టీఎన్‌జీవో సంఘాల అధ్యక్షుడు కాళీచరణ్‌, దారం శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహాశక్తి ఆలయం, పార్లమెంట్‌ కార్యాయంతోపాటు పాతబజార్‌ చిన్న హనుమాన్‌ దేవాలయంలో, 1/ఎ గోల్డెన్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో, బోయవాడ, శాస్త్రిరోడ్‌, టవర్‌సర్కిల్‌, రాంనగర్‌లలో ఏర్పాటు చేసిన వినాయక మంటపాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కమార్‌, మాజీమేయర్‌ వై సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ళపు రమేశ్‌తో కలసి పూజలు చేశారు. గాంధీరోడ్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పూజలు చేశారు. కోతిరాంపూర్‌ ఆద్శ యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భారీ వినాయకుడికి స్థానికులు పూజలు చేశారు. భగత్‌నగర్‌లో మాజీ మేయర్‌ క్యాంపు కార్యాలయంలో మాజీ మేయర్‌, బీజేపి నాయకుడు వై సునీల్‌రావు-అపర్ణ దంపతులు పూజలు చేశారు. పాతబజార్‌ గౌరీశంకరాలయంలో, గిద్దె పెరుమాళ్ల ఆలయంలో జరిగిన అభిషేక అర్చనలు, అలంకార, పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:48 AM