Share News

Karimnagar: అటవీశాఖ అమర వీరుల సేవలు మరువలేనివి

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:50 PM

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అమరవీరుల సేవలు చిరస్మరనీయమని డీఎఫ్‌వో సీహెచ్‌ బాలమణి పేర్కొన్నారు.

Karimnagar: అటవీశాఖ అమర వీరుల సేవలు మరువలేనివి

- డీఎఫ్‌వో సీహెచ్‌ బాలమణి

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అమరవీరుల సేవలు చిరస్మరనీయమని డీఎఫ్‌వో సీహెచ్‌ బాలమణి పేర్కొన్నారు. అటవీశాఖ జాతీయ అమర వీరుల సంస్మరణ దినోత్సవమును పురస్కరించుకొని కరీంనగర్‌ జిల్లా అటవీ కార్యాలయంలో గురువారం అటవీశాఖ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో విధి నిర్వహణలో భాగంగా అంకితభా వంతో పనిచేస్తూ స్మగ్లర్ల చేతిలో అమరులైన నరహరి, లక్ష్మీనారాయణ, పద్మారావు ఇతర అమరవీరులను స్మరించుకున్నారు. వారి పేరు చిరస్మరణీయంగా ఉంటుందని డీఎఫ్‌వో బాలమణి పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులైన సరోజ, పుష్పలతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌, హుజరాబాద్‌ ఎఫ్‌ఆర్‌ఓలు షౌకత్‌ హుస్సేన్‌, బుర్ర లత, జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:50 PM