Karimnagar: రెండో విడత ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:13 AM
తిమ్మాపూర్, డిసెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): రెండో విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్, డిసెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): రెండో విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేద్రంలోని కౌంటర్‌ను ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో ఆమె మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారంా తనిఖీ చేసుకోవాలని, ఏదైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదికలు సమర్పించాలని ఆదికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కార్యక్రమంలో ఎంఈడీవో రాజీవ్ మల్హోత్ర, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
పంచాయితీ ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. మానకొండూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ కేంద్రాన్ని శనివారంు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు శిక్షణ పొందిన ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసుకుని ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభించి ఒంటి గంటకు ముగించాలని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలని సూచించారు. ఆదివారం జరుగబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీధర్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో వరలక్ష్మీ, ఎంపీవో సతీష్‌రావు, ఎంఈవో మధుసుదనాచారి పాల్గొన్నారు.