Karimnagar: రౌడీ, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:00 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ టౌస్ పోలీస్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిత్యం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం అన్నారు.
- పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
- సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ టౌస్ పోలీస్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిత్యం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం అన్నారు. కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం తనిఖీ చేశారు. అధికారులతో కార్యాలయంలోని పెండింగ్ కేసులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. పెండింగ్ కేసులకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అర్బన్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నందున, వాటి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు పకడ్భంధీగా చేయాలన్నారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై చర్చించి కారణాలను తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. సమావేశంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్ రావు, సృజన్‌రెడ్డి, జాన్‌రెడ్డి, మహిళా ఠాణా సీఐ శ్రీలత పాల్గొన్నారు.