Karimnagar: ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:50 AM
భగత్‌నగర్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సిబ్బందిని ఆదేశించారు.
భగత్‌నగర్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సిబ్బందిని ఆదేశించారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీ, షుగర్‌తో బాధపడుతున్న వారు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులు ఆరోగ్య కేంద్రంలో తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పీఓఎంహెచ్‌ఎన్ డాక్టర్ సన జవేరియా, వైద్యాధికారి డాక్టర్ నజీమా సుల్తానా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.