Share News

Karimnagar: సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యం

ABN , Publish Date - May 23 , 2025 | 12:45 AM

చిగురుమామిడి, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమపథకాలు అమలు చేయడమే లక్ష్యం గా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రావాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు.

 Karimnagar:   సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యం

రాష్ట్ర రావాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్‌

చిగురుమామిడి, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమపథకాలు అమలు చేయడమే లక్ష్యం గా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రావాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతనిర్మాణ సన్నాహకసమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. మళ్లీకాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన ప్రతి కార్యకర్తకు సరైనా గుర్తింపు ఉంటుందన్నారు. హుస్నాబాద్‌ వ్యవసాయశాఖ కమిటీ చైర్మన్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీసీసీ పరీశీలకుడు రఘునాథ్‌ రెడ్డి, నమిళ్ల శ్రీనివాస్‌, చిట్టుమల్లరవీందర్‌, ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, మాజీజడ్పీటీసీ గీకురు రవీందర్‌, పోలుస్వప్న, సింగిల్‌ విండో మాజీచైర్మన్‌ చిట్టుమల్ల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పూజలు..

చిగురుమామిడి శివారులోగల పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను అర్చకులు ఘనంగా సన్మానించారు.

Updated Date - May 23 , 2025 | 12:45 AM