karimnagar : తొలివిడత కాంగ్రెస్‌దే
ABN , Publish Date - Dec 12 , 2025 | 02:31 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శించింది.
- రెండో స్థానంలో బీఆర్‌ఎస్
- సత్తాచాటిన బీజేపీ
- ప్రశాంతంగా ‘పంచాయతీ’ ఎన్నికలు
- 81.42 శాతం పోలింగ్
- ఓటు హక్కును వినియోగించుకున్న 1,24,088 మంది ఓటర్లు
- చలితీవ్రతతో తొలి రెండు గంటల్లో తగ్గిన ఓటింగ్ శాతం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ విడతలో 92 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగగా 41స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బల పరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. 25 సర్పంచ పదవులను బీఆర్‌ఎస్ దక్కించుకోగా, 14 స్థానాల్లో గెలుపొంది బీజేపీ తన సత్తాను చాటింది. 12 పంచాయతీల్లో స్వతంత్రులు సర్పం చులుగా విజయం సాధించారు. టీడీపీ ఒక స్థానంతో ఖాతా తెరిచింది. తొలి విడత ఐదు మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాం తంగా జరిగాయి. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని 91 గ్రామపంచాయతీల్లోని 89 సర్పంచ పదవులు, 590 వార్డుసభ్యుల ఎన్నికలకు 858 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది.
మందకొడిగా ప్రారంభమై.. ఊపందుకున్న పోలింగ్
కరీంనగర్ రూరల్ మండలంలో 84.67శాతం, కొత్తపల్లిలో 79.18శాతం, గంగాధరలో 78.6, రామడుగు మండలంలో 82.05శాతం, చొప్పదండి మండలంలో 83.66శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం చలి తీవ్రత అధికంగా ఉండడంతో మందకొడిగా ప్రారంభమై క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఐదు మండలాల్లో కలిపి మొత్తం సగటు ఓటింగ్‌శాతం 81.42 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారందరికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో చాలా గ్రా మాల్లో ఓటర్లు బారులు తీరి ఓటు వేశారు. ఓట రు స్లిప్‌తోపాటు ఆధార్ కార్డు, ఓటరు ఐడీ లేదా ఏదైనా గుర్తింపుకార్డుతో వచ్చిన వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు.
ఫకీర్‌పేటలో గందరగోళం
కరీంనగర్ రూరల్ మండలంలోని ఫకీర్ పేట గ్రామంలో ఓటరు ఐడీ తప్పనిసరిగా ఉండాలని, వేరే గుర్తింపుకార్డులు చూపిం చినా ఓటు వేసేందుకు అనుమతించక పోవడంతో కొద్దిసేపు ఓటర్లు నిరసన తెలిపారు. ఎంపీడీవో జోక్యం చేసు కొని ఎన్ని కల కమిషన నిర్దేశించిన ఇతర గుర్తిం పు కార్డులున్న వారిని కూడా ఓటు వేసేందుకు అనుమతించడంతో వివాదం సద్దు మణిగింది.
బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు
ఐదు మండలాల్లో 1,52,408 మంది ఓటర్లు ఉండగా 1,24,088 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల లకు పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను తరలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారం భించారు. సర్పంచు, వార్డుసభ్యుల బ్యాలెట్‌లను వేరు చేసి ముందుగా వార్డుసభ్యుల ఓట్లను లెక్కించిన అనం తరం అన్ని వార్డుల్లోని సర్పంచు బ్యాలెట్ పేపర్ల న్నిటిని కలిపి 25 ఓట్లకు కట్టలు కట్టి బ్యాలెట్లను లెక్కించారు. చెల్లని ఓట్లను వేరుగా లెక్కించిన త ర్వాత మొత్తం ఓట్లను లెక్కించి అత్యధికంగా ఓ ట్లు వచ్చిన వారితోపాటు అభ్యర్థులందరి సంత కాలను తీసుకొని విజేతల పేర్లను ప్రకటించారు.
ఒక గ్రామపంచాయతీ... రెండు సర్పంచ.. 276 వార్డుసభ్యులు ఏకగ్రీవం
తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో సర్పంచ, ఎనిమిది వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన దాఖలు కావడంతో ఆ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిం చారు. గ్రామ సర్పంచగా వడ్లకొండ తిరుమల ఎన్నికయ్యారు. ఇదే మండలంలోని పెద్ద కురుమ పల్లి సర్పంచుగా మావురం సుగుణ, రామడుగు మండలం శ్రీరాములపల్లి సర్పంచగా ఒంటెల సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు మండలాల్లో మొత్తం 276 వార్డులు ఏకగ్రీవ మయ్యాయి.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి రామడుగు మండలం వెదిర, గంగాధర మండలం కురి క్యాల, కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. కొత్తపల్లి మండ లంలోని ఎలగందల్, ఖాజీపూర్ పోలింగ్ కేంద్రాలను అడిష నల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్వినితానాజీవాఖడే సంద ర్శించి ఎన్నికల సిబ్బంది, ఓటర్లతో ఏర్పాట్లపై చర్చించారు. ఐదు మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసు కమిషనర్ గౌస్ ఆలం పర్యటించి పోలింగ్, కౌంటింగ్‌ను పరిశీలించారు.