Share News

Karimnagar: బీసీలను మోసం చేస్తున్న కేంద్రం

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:49 PM

భగత్‌నగర్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు.

Karimnagar:  బీసీలను మోసం చేస్తున్న కేంద్రం

భగత్‌నగర్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు. గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, గవర్నర్‌కు పంపితే ఆరు నెలలు గడిచినా ఆమోదించలేదన్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే రావడం, సుప్రీం కోర్టులో నిరాశ ఎదురు కావడం బలహీన వర్గాలను నిరాశకు గురి చేసిందన్నారు. బీసీ వర్గాలు బీజేపీని గ్రామ గ్రామాన అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, బీమా సాహెబ్‌, సుంకరి సంపత్‌, రమేష్‌, శీలం అశోక్‌, డి నరేష్‌, కొప్పుల శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:49 PM