Share News

Karimnagar: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:24 AM

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే ఉందని దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అన్నారు.

Karimnagar:  పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

- జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే ఉందని దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోధ్యాయుల సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో నూతనంగా గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారిని ఘనంగా సన్మానించారు. ముఖ్య అతితిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు పరోక్షంగా సేవలందిస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా సేవచేసే అవకాశం ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాశాఖ అధ్యక్షులు నలుమాసు సుదర్శనం, జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి భగవంతయ్య, సర్వ శిక్ష అభియాన్‌ కో-ఆర్డినేటర్లు కర్ర అశోక్‌ రెడ్డి, ఆంజనేయులు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపల్లి శ్రీనివాస్‌, కోశాధికారి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:24 AM