Karimnagar: డ్రోన్ కెమెరాలతో నిఘా..
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:20 AM
కరీంనగర్ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆదివారం పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం పరిశీలించారు.
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ గౌస్‌ఆలం
కరీంనగర్ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆదివారం పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం పరిశీలించారు. క్షేత్రస్థాయిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి భద్రతా చర్యలపై పలు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సీపీ సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాలన్నారు.