Karimnagar: విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:52 PM
కరీంనగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- డీవైఎస్‌వో వి శ్రీనివాస్‌గౌడ్
- వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం
కరీంనగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయులకు నూతనంగా ప్రారంభించిన స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లను వ్యాయామ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడల్లో నూతనంగా వస్తున్న మార్పులను గమనిస్తూ శిక్షణ అందిస్తే విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. జిల్లాలోని 16 మండలాల వ్యాయామ ఉపాధ్యాయులకు ఒకేచోట సమావేశం నిర్వహించడం అభినందనీ యమన్నారు. పాఠశాలల క్రీడా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి వేణుగోపాల్ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు వ్యాయామ విద్యకు సంబంధించిన క్రీడాంశాలపై, ఫుడ్, న్యూట్రిషన్, బ్యాలెన్స్ పుడ్, యోగా, నిర్వహించాల్సిన రిజిస్టర్లు, తదితర విషయాలపై తెలుసుకోవాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ క్రీడా పాఠశాల ప్రధానో పాధ్యాయులు కె శ్రీనివాస్, క్రీడా పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సత్యనారాయణ, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, సీహెచ్ శ్రీనివాస్, డీఆర్‌సీలు ఆర్ నర్సయ్య, కే సమ్మయ్య, వి శ్రీలత, సీహెచ్ శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ ఆకట్టుకున్న యోగా విన్యాసాలు.
ఈ సమావేశం సందర్భంగా క్రీడా పాఠశాల జూడో హాల్‌లో నిర్వహించిన యోగా విన్యాసాలు అలరించాయి. వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు ప్రదర్శించిన వివిధ యోగాసనాలు ఆకట్టుకు న్నాయి. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు యోగా విన్యాసాలను చేసి అలరించారు.