Karimnagar: రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:58 PM
చిగురుమామిడి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉన్న రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీపీ గౌస్ అలం ఆన్నారు.
- సీపీ గౌస్ ఆలం
చిగురుమామిడి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉన్న రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీపీ గౌస్ అలం ఆన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సెక్టారు, సబ్‌సెక్టార్లు విభజించి ఆయా గ్రామాలకు పోలీసులను కేటాయించాలన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట తిమ్మపూర్ సీఐ గడ్డం సదన్‌కుమార్, ఎస్సై సాయికృష్ణ పాల్గొన్నారు.