Karimnagar: పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:18 AM
చొప్పదండి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.
స్వచ్ఛ ఆటోలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గురువారం చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో తడి, పొడి చెత్తసేకరణ కోసం కొనుగోలు చేసిన ఐదు స్వచ్ఛ ఆటోలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని అన్నారు. అనంతరం నవోదయ విద్యాలయంలో రూ.15లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణపనులు, ఆర్నకొండలో నూతన బోర్, హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఆర్నకొండలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మార్కెట్‌చైర్మన్ కొత్తూరు మహేష్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, మాజీమున్సిపల్ చైర్‌పర్సన్ గుర్రం నీరజ, కార్యకర్తలు పాల్గొన్నారు.