Share News

Karimnagar: జీవ వైవిధ్య పరిరక్షణలో నేలది కీలక పాత్ర

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:42 PM

భగత్‌నగర్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జీవ వైవిధ్య పరిరక్షణలో నేల కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి అన్నారు.

Karimnagar:  జీవ వైవిధ్య పరిరక్షణలో నేలది కీలక పాత్ర

భగత్‌నగర్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జీవ వైవిధ్య పరిరక్షణలో నేల కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో కరీంనగర్‌ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పంట అవశేషాల నిర్వహణ పద్ధతులపై రైతులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అధిక రసాయనాల వాడకం పంట వ్యర్థాలను తగులబెట్టడం వంటి అంశాలను రైతులు పరిగణనలోకి తీసుకుని నేల, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నారు. శాస్త్రవేత్త మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ నేలల దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన నేలలు పునాదులు అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ హరికృష్ణ, శాస్త్రవేత్త డాక్టర్‌ ఇ రజనీకాంత్‌, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, సహకార భారతి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ న్యాలమడుగు శంకరయ్య, మండల వ్యవసాయాధికారి సంతోష్‌, ఎఈఓ రాము, రమేష్‌రెడ్డి, బాలాజీ, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:42 PM