Share News

Karimnagar: పారిశుధ్యం మెరుగుపరచాలి

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:49 AM

కరీంనగర్‌ రూరల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): విలీన గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అధికారులను ఆదేశించారు.

Karimnagar:   పారిశుధ్యం మెరుగుపరచాలి

దుర్శేడ్‌లో పర్యటిస్తున్న కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ రూరల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): విలీన గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. దుర్శేడ్‌ గ్రామంలో ఆయన గురువారం పర్యటించారు. పారిశుధ్య పనులతోపాటు డ్రైనేజీలు, చెత్త సెగ్రిగేషన్‌ డీఆర్‌సీసీ షెడ్డును తనిఖీ చేశారు. అనంతరం వార్డు కార్యాలయాన్ని సందర్శించి అధికారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఫ నగరపాలక సంస్థ షటర్ల తనిఖీ

కరీంనగర్‌ టౌన్‌: నగరపాలక సంస్థ ఆవరణలో ఉన్న షటర్లను కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ తనిఖీ చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్‌, ఖాదర్‌ మోహియుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 12:49 AM